15 June, 2026 | 2:30 AM

ప్రజాసంక్షేమ ప్రభుత్వానికి న్యాయవాదులు మద్దతుగా నిలవాలి

15-06-2026 01:20 AM

ఏఐసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి

తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా రెండవసారి ఎన్నికైన చలకాని వెంకట్ యాదవ్ సన్మాన సభ

ముషీరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి, సామాజిక న్యాయ ఉద్యమానికి న్యాయవాదులు మద్దతుగా నిలవాలని ఏఐసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, చిలకాని వెంకట్ యాదవ్  తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ గా రెండవసారి ఘన విజయం సాధించిన సందర్భంగా పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సన్మాన కార్యక్రమానికి నాగ సీతారాములు, వై. రవికుమార్ యాదవ్ (సీనియర్ న్యాయవాది)  అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా  ఏఐసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్  హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదల సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని అన్నారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి, సామాజిక న్యాయ ఉద్యమానికి, న్యాయవాదులు మద్దతుగా నిలవాలని కోరారు.

చలకాని వెంకట్ యాదవ్ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని వారు ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత వెంకట్ యాదవ్  మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కొని తనకు విజయం అందించిన న్యాయవాద మిత్రులకు పెద్దలకు,  అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అదే విధంగా రాష్ట్రస్థాయిలో న్యాయవాదులు నాకు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడమే కాకుండా న్యాయవాదుల సంక్షేమం మరి అభివృద్ధి కోసం పాటుపడతానని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమలుకై కృషి చేస్తానని వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ పీపుల్ బలహీనుల గొంతుకగా ఉంటారని ప్రకటించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ చలకాని వెంకట్ యాదవ్ చిన్ననాటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని... నిలదోక్కుకొని, వృత్తి పట్ల, పని పట్ల నిబద్ధత కల వ్యక్తిగా సమాజంలో తనకు చేతనైనంత సహాయం చేసే మనసు కలవాడు.

గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ గా రెండోసారి ఎన్నికవ్వడం అనేది అంత ఈజీ కాదని... సమాజంలో అన్యాయానికి గురవుతున్న పేదప్రజల పక్షాన న్యాయ సహాయం న్యాయ సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, సమాచార శాఖ మాజీ చైర్మన్ వర్రె వెంకటేశ్వర్లు (పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్) చింతల రవీంద్రనాథ్, ముక్కామల వెంకన్న, ఆర్. లక్ష్మణ్ యాదవ్, ఎ.అచ్యుత,  న్యాయవాదులు నోముల సైదులు, నోముల శేషు, దాసరి శ్రీనివాస్, శివ, శ్రీహరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.