15 June, 2026 | 1:27 AM

నూతన విద్యాసంవత్సరం పునః ప్రారంభం

15-06-2026 12:22 AM

బోధన్, జూన్ 14 (విజయక్రాంతి): బోధన్ మండలంలోని జాడి జమాల్పూర్ గ్రామంలో గ్రామ యువత ముందుకు కదలి వచ్చి పాఠశాల ఆవరణం లో పేరుకుపోయిన చెత్త చేదరం శుభ్రం చేయడం జరిగింది అలాగే పాఠశాల భవనంకి సొంత ఖర్చులతో రంగులు వేయించడం జరిగింది.

ఈ సేవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోగినేని జ్యోతి నరేంద్రబాబు, ఉప సర్పంచ్ యాపారు శ్రావణ్  మరియు గ్రామ,పి ఎస్ సిచైర్మన్ దాసరి అంతయ్య, వార్డు మెంబర్ కోలి నరేష్, ఆంజనేయులు అలాగే ప్రధానోపాధ్యాయుడు శ్రీదేవి, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, రాజ్యలక్ష్మి మరియు గ్రామ పెద్దలు గోగినేని రాజేంద్రప్రసాద్, గురు బ్రహ్మం, వాసు,అశోక్, ప్రతాప్ గ్రామ యువత, బెల్లంకొండ సురేష్, గోపి, శ్యాం నాయుడు, మహేష్, శ్రీకాంత్, చిక్కు, నరేష్, రవి, రాజేశ్వర్మ , పవన్కళ్యాణ్ పెయింటర్ రాజు తదితరులు పాల్గొన్నారు.