15 June, 2026 | 2:32 AM

సర్కారు బడులు బాగు పడేనా?

15-06-2026 01:20 AM

బ్రేక్ ఫాస్ట్ సరే ఏర్పాట్లు  ఏవి

కరీంనగర్, జూన్14 (విజయ క్రాంతి): వే సవి సెలవుల తర్వాత సోమవారం నుంచి సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొ త్తంగా 2,000 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక, ఉ న్నత, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్ మరి యు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి.  కొత్తగా ప్రీ-ప్రైమరీ, ఇతర పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్య లు చేపట్టింది. ప్రీ-ప్రైమరీ స్కూళ్లు, బాలికల కోసం కేజీబీవీలలో ఆంగ్ల మాధ్యమం విజయవంత మయింది.

ఎన్ని ఉన్నా సర్కారు బడులు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. ప్రస్తుతం చాలాచోట్ల పాఠశాలలలో మౌలిక వసతులు లేక అధ్వానంగా మారా యి. కొన్నిచోట్ల భవనాలు శిథిలావస్థకు చే రుకోగా, మరికొన్ని చోట్ల తరగతి గదులు, వంటశాలలు దెబ్బతిన్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్వహణ లేక మూతపడిపోయాయి. నిర్వహణ లేక పాఠశాలల ఆ వరణలు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. సెలవుల ప్రారంభం నుంచే స్కూళ్లలో సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులు ప్రత్యే కంగా కార్యాచరణ రూపొందించుకున్నా, అ వి సాధ్యం కాలేదు.  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో మగ్గుతున్నాయి. ఎటు చూసినా అసౌ కర్యాలే కనిపిస్తున్నాయి. .  నగరంలోని కార్ఖానగడ్డ హైస్కూల్ ఏటా అడ్మిషన్లతో నిండి పోతున్నా, సరిపడా తరగతి గదులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.

- సౌకర్యాలు ఏవి..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న బ్రేక్ఫాస్ట్ పథకం జిల్లాలో ఒ కేసారి  అమలయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్కూళ్ల లో మాత్రమే ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నారు. పథకం అమలుకు పాఠ శాల విద్యాశాఖ మెనూను రూపొందించగా, ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపలేదు. ఈ ఫైల్ సర్కార్ పరిశీలనలో ఉన్నది. స్కూళ్లే కాకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా బ్రేక్ఫాస్ట్ అమలుచేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఈ నెల 15 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కాబోతున్నాయి. తొలిరోజే బ్రేక్ ఫాస్ట్ అందుతుందో.. లేదో అనుమనాలున్నాయి. ఇంకా పాఠశాలలలో ఇందుకు సంబంధించిన వంట సామాగ్రి కానీ, దినుసులు కానీ రాలేదు.

లక్ష్యం నెరవేరేనా...

బడిబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 4,900 మంది విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా నిర్ణయించారు. ‘బడిబాట‘ కార్యక్రమం ఈనెల 19 వరకు కొనసాగుతుంది. ఇప్పటివరకు గంగాధర మండలంలో తప్ప మిగితా చోట్ల ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి  హెచ్చరించారు. స్కూళ్లలోనే పుస్తకాలు, నోట్బుక్కులు విక్రయించరాదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో డి ఈ ఓ ఉత్తర్వులు పేపర్ కే పరిమితమవుతున్నాయి.