కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- మిర్యాలగూడలో మేడే వేడుకలు
- ఆర్టీసీ, పారిశుధ్య కార్మికులతో సహపంక్తి భోజనం
మిర్యాలగూడ, మే 1 (విజయక్రాంతి): కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని డిప్యూటీ సీంఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మే డేను పురస్కరించుకుని శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తం గా అన్ని రంగాలలోని కార్మికులందరూ జరుపుకునే మేడే వేడుకలు కార్మికుల హక్కుల సాధనకై జరిపిన ఐక్య పోరాటాలకు గుర్తిం పు అన్నారు.
రాజ్యాంగంలో కార్మికుల హక్కులు, చట్టాల రూపంలో కల్పించిన భద్ర త పని గంటల విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు స్త్రీ, పురుష కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అనే విధానాన్ని తీసుకువచ్చిన మహా వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. కార్మికులందరూ తమ హక్కుల సాధన కొరకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని అందుకు ప్రభుత్వా లు చట్టాలు చేసి వాటి అమలు బాధ్యతలు తీసుకుంటాయన్నారు. అనంతరం ఆర్టీసీ, పారిశుధ్య కార్మికులతో సహా పంక్తి భోజనం చేశారు. అంతకుముం దు తన ముఖ్య ప్రజాసంబంధాల అధికారి మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనవెంట కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, డిసిసి అధ్యక్షులు పున్న కైలాస్ నేత, డీఎస్పీ రాజశేఖర్ రాజు, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ ఉన్నారు.






