11-02-2026 03:29:52 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి10 (విజయక్రాంతి): అనుమానాస్పదస్థితిలో వాచ్మెన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమలగూడ పిఎస్ పరిధిలోని బండ మైసమ్మనగర్‌లో జరిగింది. దోమలగూడ పోలీస్టేషన్ సిఐ ఆంజర్‌అలీ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లోని క్యూకా విలేజ్ అచ్చం డిస్ట్రిక్ ప్రాంతానికి చెందిన రమేష్ గోలి (25), కవిత (22) భార్యభర్తలు. వీరికి రెండు సంవత్సరాల కూతురు ఉంది.
బతు కు దేరువుకోసం ముంబాయిలో పనిచేసి నెల రోజుల క్రితమే దోమలగూడ పీఎస్ పరిధిలోని బండమైసమ్మనగర్‌లో ఓ ఇంటి వాచ్‌మెన్‌గా విదుల్లో చేరాడు. అయితే ఈనెల 6న రమేష్ గోలికి ఇంటి యజమాని జీతం ఇచ్చాడు. అప్పటినుంచి ప్రతి రోజు మద్యం సేవిస్తుండేవాడు. కాగా సోమవారం రాత్రి రమేష్ గోలి ఇంట్లో కూడా మద్యం తాగుతుండగా తన భార్య, కూతురు బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి తన భర్త ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు.
ఉరివేసుకొన్న అతన్ని కిందకు దించి స్థానిక దోమలగూడ పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సమాచారం అందుకున్న దోమలగూడ సిఐ అంజద్ అలీ, నైట్ డ్యూటీ ఆఫీసర్ చిలకలగూడ ఏసీపీ శశాంకరెడ్డి. పిఎస్ ఎఎస్ ఐ నారాయణలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆయన మృతదేహాన్ని పోస మార్థం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. భార్య కవిత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అంజద్ అలీ తెలిపారు.