ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు
నిజాంసాగర్ జూలై 14( విజయ క్రాంతి )ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు,మంగళవారం రోజు బొగ్గు గుడిసె నుండి నిజాంసాగర్ వెళ్ళే రహదారి పై నిజాంసాగర్ సబ్-ఇన్స్పెక్టర్ జె శివ కుమార్ తన సిబ్బందితో కలిసి ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మరియు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరియు కార్లతో సహా మొత్తం 120 వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.హెల్మెట్ లేకపోవడం, త్రిబుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, లైసెన్స్ లేకపోవడం,మోడిఫైడ్ సైలెన్సర్లతో తిరుగుతున్న వాహనాలపై మొత్తం 20 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఒరిజినల్, డిజిలాకర్/mParivahan యాప్లో) అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. అనుమానస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియచేయాలి. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






