calender_icon.png 11 February, 2026 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్‌ఐ

11-02-2026 03:27:59 AM

  1. మాదాపూర్  పోలీస్ స్టేషన్లో ఏసీబీ వల
  2. కేసులో సహాయం పేరుతో రూ.50 వేల డిమాండ్

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): చీటింగ్ కేసులో సహాయం చేస్తానని చెప్పి లంచం తీసుకుంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్‌ఐ వినయ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కా డు. బాధితుడి నుంచి రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు వలపన్ని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక కేసులో తన సహకారం అందిస్తానని చెప్పిన ఎస్‌ఐ విన య్ ఇందుకు ప్రతిఫలంగా రూ. 50,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.

పెద్ద మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పి నా డిమాండ్ చేడయండంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు ప్రాథమిక విచారణ అనంతరం వలపన్నే చర్యలు చేపట్టారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఫిర్యాదుదారుడిని లంచం డబ్బులతో ఎస్‌ఐ వద్దకు పం పించగా, నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి వినయ్‌ను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.