30 July, 2026 | 1:57 AM

బాసరలో వైభవంగా వ్యాస పూర్ణిమ వేడుకలు

30-07-2026 01:09 AM

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే 

బైంసా, జూలై 29 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో బుధవారం వ్యాస పూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలలయంలో పూజలు చేసి వేద పండితులు నిర్వహించిన యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించి సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా బాసర క్షేత్రానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజలీదేవి బాసర మండల అధ్యక్షులు సాయినాథ్ పటేల్ ధర్మకర్తలు పాల్గొన్నారు