కెరీర్ కౌన్సిలింగ్.. విద్యా సామగ్రి పంపిణీ
డాక్టర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో అవగాహన కార్యక్రమం
నాగోల్, జూలై 29 (విజయ క్రాంతి): కొత్తపేట డాక్టర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ రోడ్ నెం.5లో ఉన్న కమ్యూనిటీ హాల్లో ‘ఎయిడ్ ఎట్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో, ఎన్లైట్ విద్యా ప్రాజెక్టు సహకారంతో‘ బాలికలకు కెరీర్ కౌన్సిలింగ్, గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్స్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లెంకి ధన్ రాజ్ గౌడ్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానేశ్వరి హాజరై విద్య ప్రాముఖ్యత, ఉన్నత లక్ష్యాల సాధనపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా 35 మంది బాలికలకు ‘ఎయిడ్ ఎట్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో, విద్యా సామగ్రిని పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యుడు జంగా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నహీం భాయ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అశ్విని, కమ్యూనిటీ ఆర్గనైజర్లు నాగమణి, శ్యామల, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.






