మీ సేవలు పదిలం
ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించిన విబిజీరామ్ ఉద్యోగులు
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): పేద విద్యార్థులకు మీరు చేస్తున్న సేవలు పదిలంగా ఉంటాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆట) ఆధ్వర్యంలో కమ్యూనిటీ సర్వీస్ పురస్కారం వచ్చిన సందర్భంగా పనికి ఆహార పథకం ఉద్యోగులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యాభివృద్ధికి చేస్తున్న సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం మహబూబ్‌నగర్‌కు గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శివ ప్రసాద్, సభ్యులు వెంకటేశ్వర్లు, విజయభాస్కర్, కరుణాసాగర్, విష్ణువర్ధన్ రెడ్డి, ఆనంద్, కళ్యాణి, లత కుమారి, సుజిత తదితరులు పాల్గొన్నారు.






