12 August, 2026 | 5:34 PM

కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

12-08-2026 04:40 PM

బిజినపల్లి: బిజినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, వంటగది, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, ఆహార తయారీలో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల హాజరు, విద్యాబోధన, వసతి, భోజన సదుపాయాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కథలయ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది ఉన్నారు.