ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో మెమోరాండం
నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో చేపట్టిన దశలవారీ పోరాటంలో భాగంగా బుధవారం నాగల్‌గిద్ద మండల తహసీల్దార్ సంగ్రాంరెడ్డి కి మెమోరాండం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ పీఆర్‌సీని అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే మంజూరు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని, ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని నాయకులు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా చేపడుతున్న పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూఎస్‌పీసీ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి నరసయ్య, మండల జనరల్ సెక్రటరీ నర్సింలు, ఎస్టియు జిల్లా నాయకులు కాశిరాం,యూటీఎఫ్ మండల ఉపాధ్యక్షురాలు సంగమణి, ఉపాధ్యక్షుడు హనుమంతు, టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు మురళ, మండల కార్యదర్శులు అప్పారావు, మాదప్ప, నాగప్ప, సురేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.






