12 August, 2026 | 5:06 PM

పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

12-08-2026 04:33 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేయూత పింఛన్ మంజూరుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 31వ తేదీ చివరి గడువుగా మున్సిపల్  కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేతివృత్తులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు తదితర అర్హత ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.అర్హత కలిగిన వారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును మున్సిపల్ కార్యాలయం లో సమర్పించాలని, దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి, నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.