అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలి
బోధన్,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయకపోవడం అన్యాయమని కందగట్ల రాంచందర్ సర్పంచ్, ఎడపల్లి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బుధవారం రోజున అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎడపల్లి మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. పింఛన్ల కోసం అర్హులైన అనేక మంది వృద్ధులు, బీడీ కార్మికులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోలా ఇంద్రకరణ్, జిల్లా మీడియా ఇన్‌చార్జి కూరెళ్ల శ్రీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, ప్యాట గంగాధర్, కంజరి ప్రదీప్ కుమార్, ద్యాకం సాయిరెడ్డి, కంజరి అభినవ్, బర్దిపూర్ విట్టల్, కట్కం శంకర్, అనిరుద్ గౌడ్, రాఘవేందర్, మార సాయి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






