13 August, 2026 | 6:55 PM

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

12-08-2026 03:39 PM

చిట్యాల,(విజయక్రాంతి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా  కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిస్తూ చిట్యాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక కనకదుర్గ ఆలయం నుంచి మార్కెట్ యార్డు వరకు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపిపార్టీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ గొప్పతనాన్ని, జాతీయ పతాక ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్, చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శీను, మండల ప్రధాన కార్యదర్శి పున్నం విష్ణు, మాస శ్రీనివాస్, పొట్లపల్లి నరసింహ, కూరెళ్ల శ్రీనివాస్, కన్నబోయిన మహాలింగం, గంజి గోవర్ధన్, నరేంద్రచారి, జయరపు రామకృష్ణ, వరికుప్పల నరసింహ తదితరులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.