29 June, 2026 | 2:04 AM

అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది

29-06-2026 12:00 AM

అధికార పార్టీలో ఉండి అంతర్గత విమర్శలు 

ఎమ్మెల్యే పార్టీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

నిర్మల్ జూన్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి రెండు నెలలు దాటిన నేతల్లో మాత్రం అసంతృప్తి తగ్గడం లేదు పదేళ్లపాటు ప్రతిపక్షం ఉండి కష్టకాలంలో పనిచేసిన తనకి గౌరవం లేదు. ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి మంత్రులు గౌరవం ఇస్తున్నారు. మేం చెప్తే ఒక్క పని చేస్తలేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా చూస్తలేరు. ప్రతిపక్ష  ఎమ్మెల్యేలు పార్టీల నేతలు చెప్పింది చేస్తున్నారు టిఆర్‌ఎస్ నేతలు పనులు చేస్తున్నారు.   

కార్యకర్తలకు కనీసం పదవులు ఇచ్చుకోలేని దుస్థితి. ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం తమకేందుకు ఇవ్వడం లేదు  మేము అధికార పార్టీలో ఉన్నామా.. ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా.. అర్థం కావడం లేదు. అంటూ నిర్మల్ అదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యే వేడమ బొచ్చు పటేల్, పార్టీ నేతల నరేష్ జాదవ్,  శ్రీహరి రావు,  నారాయణరావు మాట్లాడిన  వాక్యలు అధికార కాంగ్రెస్లో ప్రకంపనలు లేపాయి.

అధికార పార్టీలోనే ఉంటూ ఆ పార్టీపై విమర్శలు చేయడంపై చర్చ జరుగుతుంది వ్యాఖ్యల మర్మమేమిటో అర్థం కావడం లేదు. ఇది తిరుగుబాట. లేక ఉనికి కోసం పోరాటమా అని చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా  పేరున ఖానాపూర్ ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారి తీసింది

పార్టీలోనే ఉన్న.. అధిష్టానంపై విమర్శ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ సమావేశం నిర్వహించిన ఖానాపూర్ ఎమ్మెల్యే తో పాటు కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీ అధిష్టానం తీరుపై సమావేశంలోనే అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీలో అసంతృప్తి ని కారణమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ లో మాత్రమే కాంగ్రెస్ గెలవగా మిగతా నాలుగు చోట్ల బీజేపీ మూడు బిజెపి మూడు టీఆర్‌ఎస్ ఒక్క స్థానంలో ఎమ్మెల్యే గెలుపొందారు.

అయితే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం లేకపోయినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జిలతో కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ప్రభుత్వపరంగా అమలు చేస్తే సంక్షేమ పథకాల్లో తమ ప్రమేయం లేకుండానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నేతలు చెప్పినట్టు జిల్లా అధికారులు నడుచుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమ మాట వినకపోగా గౌరవించడం లేదని వారు సమావేశాల్లో పేర్కొనడం నిరాశకు కారణం. 

పనిచేసి కార్యకర్తలకు పదవులు ఇవ్వడం లేదు. పార్టీ కోస మేమెట్ల పని చేయాలి. కార్యకర్తలు కూడా మా మాట వింటలేరు. ఇట్లయితే మాకు నష్టమే పార్టీకి నష్టమే.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పటికైనా మాకు గౌరవం ఇస్తారా లేకపోతే మా దారి మేం చూసుకోమంటారా అంటూ కొందరు నాయకులు సమావేశంలోనే అధిష్టానం పెద్దలను నిలదీస్తున్నారు