23 April, 2026 | 4:09 PM

తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభ గోడ పోస్టర్ల ఆవిష్కరణ

23-04-2026 03:04 PM

దేవరకొండ,(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభ గోడ పత్రిక పోస్టర్ లను ఆవిష్కరించిన జాగృతి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మన అశోక్ యాదవ్. ఈ నెల 25న తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు గురువారం  దేవరకొండ పట్టణంలోని స్థానిక రహదారి బంగ్లాలో మేడ్చల్‌లో నిర్వహించే ఆవిర్భావ సభకు సంబంధించిన గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మన అశోక్ యాదవ్, ఎచ్చా శ్రీకాంత్, లకుమారపు మల్లయ్య మాట్లాడుతూ అమరుల ఆశయాలు, ఉద్యమకారుల ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ప్రారంభించనున్న కొత్త రాజకీయ పార్టీకి మద్దతుగా నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.యువకులు, మహిళలు, మేధావులు, కళాకారులు, కవులు అందరూ సభకు తరలిరావాలని, ప్రతి మండల కేంద్రం నుండి బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రజినీకాంత్ సభవత్ నిరంజన్,కే నిరంజన్,రామదాసు, గోపాల్, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.