జిమ్నాస్టిక్స్‌లో అంజనకు స్వర్ణం
06-07-2026 02:24 AM
కేన్స్, జూలై 5: హైదరాబాద్‌కు చెందిన జిమ్నాస్ట్ అంజన మరోసారి అంతర్జాతీయ పోటీల్లో అదరగొట్టింది. ఫ్రాన్స్‌లోని కేన్స్ వే దికగా జరుగుతున్న 4వ లిటిల్‌స్టార్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఇంటర్నేషనల్ కాంపిటేషన్‌లో అంజన స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మణికొండ జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడమీకి చెందిన అంజన రిబ్బన్ ఈవెంట్‌లో అద్భుత ప్రతిభ కనరిచిందని కోచ్ అలికా జో తెలిపారు. అంజనకు జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడ మీ సభ్యులు, తోటి క్రీడాకారులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు.






