25 July, 2026 | 2:42 AM

దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ నాయకుల అరెస్టు

25-07-2026 01:56 AM

ఎల్బీనగర్, జూలై 24: రాష్ట్రంలో విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో శుక్రవారం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేయగా, కొందరిని అరెస్టు చేసి, ఇతర ప్రాంతాలకు తరలించారు. దిల్ సుఖ్ నగర్ లో ఉంటున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను సరూర్ నగర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ... మిమ్మల్ని అరెస్టు చేసే బదులు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పోలీస్ ఉద్యోగాల భర్తీల సంఖ్యను పెంచి, నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. 19 వేలతో పోలీస్ నోటిఫికేషన్ జారీ చేసి, కానిస్టేబుల్ పోస్టులకు భర్తీకి వయోపరిమితిని 36 సంవత్సరాలు, ఎస్త్స్ర పోస్టుల భర్తీకి 38 సంవత్సరాలు మార్చాలని డిమాండ్ చేశారు.  ప్రశ్నించే గొంతు నొక్కాలని అరెస్టులు చేస్తే రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థి నాయకులు పుట్టుకొస్తారని,  అక్రమ అరెస్టులతో సమస్యలు పరిష్కారం కావని హెచ్చరించారు.