ఇబ్రహీంపట్నంలో బీ.టెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, జూలై 24 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో బి.టెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బల్లేపల్లి గ్రామానికి చెందిన యనమల మా నస (20) ఇబ్రహీంపట్నంలోని గురునాథ్ కళాశాలలో బి.టెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
స్థానిక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఆమె, శుక్రవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరు కుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఇబ్రహీం పట్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.






