25 July, 2026 | 2:45 AM

గజ్వేల్ అభివృద్ధిపై ఆందోళన వద్దు

25-07-2026 01:57 AM
  1. బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్
  2. ఎర్రవెల్లి నివాసంలో సమస్యలను వివరించిన నాయకులు

గజ్వేల్, జూలై 24 (విజయక్రాంతి): భవిష్యత్‌లో గజ్వేల్ పట్టణ అభివృద్ధిని తిరిగి ప ట్టాలపైకి ఎక్కిద్దామని, ఆందోళన చెందవద్దని బీఆర్‌ఎస్ నాయకులతో అధినేత, మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ఫారెస్ట్ డెవల్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ కల్యాణ్కర్ పద్మబాయ్ నర్సింగరావు, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, జుబైర్ పాషా, సహా పలువురు కౌన్సిలర్లు కేసీఆర్‌ను కలిశారు.

ఈ సందర్భం గా గజ్వేల్ పట్టణ సమస్యలను వివరించారు. గత రెండున్నరేళ్లుగా గజ్వేల్ టౌన్‌లో కోటమైసమ్మ క్యాసారం రోడ్డు, రింగు రోడ్డు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని కేసీఆర్‌కు వివరించారు. కీలక సమస్య, పార్టీ బలోపేతం తదితర అంశాలపై కేసీఆర్ ఆరా తీశారు. గజ్వేల్ పట్టణ అభివృద్ధిని బీఆర్‌ఎస్ చేపడుతుందని, పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఓపిక పట్టాలని కేసీఆర్ నాయకులకు భరోసా కల్పించారు.