25 July, 2026 | 3:15 AM

అమలు చేయని.. టెండర్ గైడ్‌లైన్స్ ఎవరి కోసం?

25-07-2026 02:42 AM

కాంట్రాక్టర్లతో కార్మిక సంఘం చర్చలు

మౌనం పాటిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ 

ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆసుపత్రి కార్మికులు సమయం కావాలంటున్న కాంట్రాక్టర్..

మహబూబ్ నగర్ క్రైం జూలై 24 : నిరుపేద ప్రజలు వైద్య చికిత్సలు పొందుతున్న దేవాలయం అయినటువంటి జిల్లా జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల పరిస్థితి ఆగమ్మ గోచరంగా మారింది. ఏండ్ల తరబడి పనులు చేస్తున్న వారికి అందవలసిన వేతనం మాత్రం అందనంత దూరంగా ఉంటూ వస్తుంది. నిబంధనల మేరకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడో వస్తుంది అనుకుంటూ ఎదురుచూస్తూ తరచూ సమ్మెలు ధర్నాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్న సంబంధిత అధికార యంత్రంగానికి మాత్రం చీమకుట్టినట్లు కూడా కావడం లేదని తెలుస్తుంది.

ఒక అడుగు ముందుకేసి కార్మిక సంఘం నేతలు సంబంధిత కాంట్రాక్టర్ సభ్యులతో ప్రత్యేక చర్చలు జరిపినప్పటికీ ఆశించిన మేరకు ఫలితం మాత్రం దూరంగానే ఉండిపోతుంది. అధికారులు కలగజేసుకొని ప్రత్యేక చర్యలు తీసుకొని నియమ నిబంధనలు ప్రకారం వేతనం కార్మికులకు ఇవ్వాల్సిందే అంటూ అల్టిమేటం జారీ చేస్తే సంబంధిత కాంట్రాక్టర్ వెంటనే ఇవ్వాల్సిన వేతనం ఇస్తారని కార్మికులు చెబుతున్న మాట.

అమలు చేయని జీవోలు ఎందుకు?

జిల్లా జనరల్ హాస్పిటల్ నందు పని చేస్తున్న కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి.  ఈ మేరకు సాయి సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ నిర్వాహకులు శ్రీవాణి,రాఘవేందర్, ఏఐటీయూసీ యూనియన్ నేతలు, కార్మికుల మధ్యన ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు.

సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో కార్మికులకు యూనిఫారమ్స్, సీనియర్ కార్మికులకు ప్రమోషన్స్,ఓటి డ్యూవ్ చెల్లింపులు తదితర సమస్యలు పరిష్కరిస్తామని  జీతం సమస్యపై త్వరలోనే మళ్లీ తిరిగి మరోసారి చర్చించడానికి సమయం కావాలని ఏజెన్సీ నిర్వాహకులు చెప్పినట్లు తెలుస్తుంది.

నిబంధనల మేరకు వేతనాలు ఇవ్వాలి..

 ఆసుపత్రిలో మిగతా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ 13600  అందుతున్నాయని, వైద్యశాఖ ఉన్నత అధికారులు కార్మికులకు మోసం జరిగే విధంగా టెండర్ గైడెన్స్ రూపొందించడం చేత తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుంది.  అప్పటి టెండర్ గైడ్లైన్స్ లో ప్రకారం రూ 12093 లకు గాను రూ 11,500  మాత్రమే అందుతున్నాయి. 

కార్మికులకు కొత్త టెండర్ పాలసీ వచ్చేవరకైన పూర్తిస్థాయి వేతనమైన అందించాలని కార్మిక సంఘం నేతల సైతం చెబుతుండ్రు. వేతనల పెంపుకు సంబంధించి నిబంధనలు అమలుకు గాను మరింత సమయం ఎందుకు పడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు కలగజేసుకుని తమ న్యాయం చేయాలని వారు వారి ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.