ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ భవన్‌లో కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటామని, 2028లో మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు క్రీడలకు పెద్దపీట వేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ 50వ జన్మదినో త్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో శుక్రవారం ‘కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియ న్షిప్’ పేరుతో కుస్తీ పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, జీవన్ రెడ్డి, తలసాని సాయికిరణ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తలసాని శ్రీనివాస్‌యా దవ్ కుటుంబానికి కుస్తీతో ఎంతో అనుబం ధం ఉన్నదని, ఆయన తండ్రి కూడా ప్రముఖ పహిల్వాన్ అని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని సుమారు 70 అఖాడాలకు అవసరమైన సహా యం అందించడంతో పాటు, హైదరాబాద్ నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యే సుమా రు 150 మంది రెజ్లర్లకు షూలు, శిక్షణ, ఇతర ఖర్చులను భరించే బాధ్యతను తలసాని స్వయంగా తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి అన్ని రకాల క్రీడలకు పెద్దపీట వేస్తామని చేస్తామని హామీ ఇచ్చారు.
ఎర్రవల్లిలో మొక్కలు నాటిన కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షిలతో తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ దంపతులు కేటీర్‌ను ఆశీర్వదించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ కలియ తిరిగి, కేసీఆర్ సహా తన కుటుంబ సభ్యులతో మొక్కలు నాటారు.






