25 July, 2026 | 2:40 AM

డంపింగ్ యార్డుతో ఇబ్బందులు

25-07-2026 01:54 AM

కాంగ్రెస్ నేత మహేందర్ ముదిరాజ్

మహేశ్వరం, జూలై 24 (విజయక్రాంతి): మహేశ్వరం 1వ వార్డులోని నివాసాలు, శివాలయం మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గద్దగూటి మహేందర్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ వేస్తున్న చెత్త వల్ల దోమలు, భరించలేని దుర్వాసన పెరిగి కాలనీవాసులు, భక్తులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఆ డంపింగ్ యార్డ్ను అక్కడ నుండి వేరే చోటికి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.