25 July, 2026 | 3:16 AM

కర్మన్‌ఘాట్‌లో ‘ఫుడ్ సేఫ్టీ’ దాడులు

25-07-2026 02:42 AM

అశోక్‌సింగ్ ఫుడ్స్ సంస్థలో 110 కిలోల సేవ్, 

40 లీటర్ల వంటనూనె స్వాధీనం

ఎల్బీనగర్, జూలై 24: ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు.  కర్మన్ఘాట్లోని ఎం/ఎస్ అశోక్సింగ్ ఫుడ్స్ సంస్థపై శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అశోక్సింగ్ ఫుడ్స్ సంస్థ వివిధ ఆహార పదార్థాలను తయారీ చేస్తూ హోల్ సేల్ గా విక్రయిస్తున్నారు. అశోక్సింగ్ ఫుడ్స్ సంస్థ రిటైలర్గా తత్కాల్ రిజిస్ట్రేషన్ పొందినట్లు అధికారులు గుర్తించారు.

తనిఖీల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు అనుమానం, వంటనూనెను పలుమార్లు ఉపయోగించడం, ఆహారాన్ని అపరిశుభ్రంగా తయారు చేయడం, పరిశుభ్రత లోపాలు వెలుగుచూశాయి. వంటనూనె, సేవ్ నమూనాలను పరీక్షల కోసం సేకరించిన అధికారులు, 110 కిలోల సేవ్, 40 లీటర్ల వంటనూనెను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండరడ్స్ చట్టం-2006 కింద స్వాధీనం చేసుకున్నారు. ప్రయోగశాల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.