20 March, 2026 | 8:07 AM

వైభవంగా ఉగాది వేడుకలు

20-03-2026 12:00 AM

జవహర్ నగర్, మార్చి 19 (విజయక్రాంతి): జవహర్‌నగర్‌లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని బీరప్ప దేవాలయంలో కురుమ సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం పచ్చడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ లు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ నూతన ఏడాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా జవహర్ నగర్ లో ప్రజలంతా ఆనందంగా పంచాంగ శ్రవణం వింటూ, కలిసికట్టుగా ఉంటూ, జవహర్ నగర్ అభివృ ద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షులు సురేందర్, ఐలయ్య, మీనయ్య, సునీత, సాయి కృష్ణ, కురుమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.