ఇద్దరు దొంగల అరెస్ట్
కూకట్ పల్లి,(విజయక్రాంతి): ద్రుష్టి మరల్చి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను శనివారం బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలనగర్ కోమట్ బస్తీకి చెందిన కాశినోళ్ల నవీన్ (37), మహమ్మద్ జహంగీర్( 32 )ఆటో డ్రైవర్ లు గా పని చేస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 26వ తేది శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ జహంగీర్ కాలనీకి చెందిన మహమ్మద్ మౌలానా (60) బాలానగర్ నరసాపూర్ చౌరస్తాలో బస్సు దిగాడు.
అది గమనించిన నిందితులిద్దరిలో ఒకరు జాంగిర్ ను మాటల్లో పెట్టి బీడీ కావాలని అడగగా మరో వ్యక్తి అతని జేబులో నుంచి రూ. 11,500 రూపాయల నగదును బలవంతంగా తీసుకున్నాడు. బాధితుడు ప్రతిఘటించడానికి ప్రయత్నించగా జహంగీర్ అతనిపై దాడి చేసి ఇద్దరు నిందితులు అక్కడి నుండి పారిపోయారు. బాధితుడు మౌలానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఇద్దరు నిందితులను అదుపులోకి నిందితుల నుండి రూ. 7,100 లు స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.






