ఈ నెల 29న ఓరుగల్లుకు కేటీఆర్ రాక
27-06-2026 09:25 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు హాజరవుతారని, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. ఈ సమావేశానికి తూర్పు పరిధిలోని 3500 మంది గులాబీ కార్యకర్తలు పాల్గొంటారని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, ఎస్ఐఆర్ పై కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కావున కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని రైతు మహాసభ నిర్వహించిన ప్రాంతంలో జరుగుతుందని తెలిపారు.






