డ్రైనేజ్ కాలువలో పడి గాయపడిన మహిళను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండ,(విజయ క్రాంతి): అభివృద్ధి పనుల్లో భాగంగా బాలసముద్రం వద్ద జరుగుతున్న డ్రెయిన్ పనుల్లో ప్రభుత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా గాయపడిన విమల అనే మహిళ శ్రీచక్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ శనివారం రోజున పరామర్శించారు. ఇటీవల హనుమకొండ ప్రెస్ క్లబ్ వద్ద డ్రెయినేజీ నిర్మాణం కోసం రోడ్డును తవ్వారు,కానీ అక్కడ ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకొని కారణంగా శ్రీ చక్ర ఆస్పత్రిలో పని చేస్తున్న విమల అనే మహిళ ప్రమాదవశాత్తు`ఆ గొయ్యిలో పడగా, నడుము విరిగింది.
కాగా, బాధితురాలు ప్రభుత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తాను గాయపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేపట్టిన ప్రాంతంలో ఎటువంటి సూచికలు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాక మరో ఇద్దరు సైతం శుక్రవారం రోజున గాయపడ్డారని తెలిపారు.తమ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చాక ఈరోజు బారికేడ్లు పెట్టారని దాస్యం వినయ్ భాస్కర్ కి బాధిత మహిళ వివరించారు. కాగా బాధిత కుటుంబానికి దాస్యం వినయ్ భాస్కర్ ఆర్థిక సాయం అందించారు. పరామర్శించిన వారిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు నర్సింహ రావు, తక్కళ్లపల్లి వినీల్ రావు, విజయ్, గౌస్ ఖాన్, మహేష్, శ్రీకాంత్ చారి తదితరులు ఉన్నారు.






