27 June, 2026 | 10:55 PM

శ్రీ ఇందు కాలేజీ బస్సుల తనిఖీ

27-06-2026 09:42 PM

వెలుగులోకి భారీ లోపాలు

​ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): షేరిగూడలోని శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ బస్సులకు ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రతా తనిఖీలు నిర్వహించారు. మొత్తం 13 బస్సులను పరిశీలించగా, విద్యార్థుల భద్రతను ప్రమాదంలో పడేసే పలు తీవ్ర లోపాలు బయటపడ్డాయి.​13 మంది డ్రైవర్లకు యూనిఫాం లేదు; ఏ బస్సులోనూ హెల్పర్లు/అటెండెంట్లు లేరు.​ నలుగురు డ్రైవర్ల వయస్సు 60 ఏళ్లు దాటింది.​

కొన్ని బస్సులకు అరిగిపోయిన టైర్లు, పనిచేయని ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు ఉన్నాయి. ​ఒక బస్సుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు లేదు. మరికొన్నింటిలో ఎమర్జెన్సీ హ్యామర్లు లేవు. ​ఈ లోపాలపై స్పందించిన ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి, విద్యార్థుల రక్షణ దృష్ట్యా వీటిని తక్షణమే సరిచేయాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అటెండెంట్లను నియమించాలని, డ్రైవర్లు యూనిఫాం ధరించేలా చూడాలని మరియు రోడ్డు భద్రతాప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.