27 June, 2026 | 10:32 PM

బెస్తగూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం

27-06-2026 09:30 PM

రిబ్బన్ కట్ చేసిన సర్పంచ్ భీమేశ్వరి, కాంగ్రెస్ జిల్లా నేత సునీల్ బాబు

వెంకటాపురం,(నూగూరు),(విజయక్రాంతి): పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ వెంకటాపురం మండలం బెస్తగూడెం (వాడగూడెం) గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం శనివారం ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన సునారికాని స్వరూప-రవి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని గ్రామ సర్పంచ్ భీమేశ్వరి, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్యం సునీల్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సునీల్ బాబు మాట్లాడుతూ... "రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునర్వైభవం తెచ్చింది. అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నాం. బెస్తగూడెం పంచాయతీకి ఈసారి ఎక్కువ ఇళ్లు మంజూరయ్యేలా నా వంతు కృషి చేస్తాను" అని హామీ ఇచ్చారు.