వైద్యుల ప్రాధాన్యత కంటే నర్సుల సేవలు ఎంతో గొప్పవి
ప్రజలకు అంకితాభావంతో వైద్య సేవలు అందించాలి.
కెసిఆర్ హయాంలో ఒకే జీవోతో ఒకే రోజు నర్సింగ్ కళాశాల మంజూరు.
విత్తనంతో మొదలై మహా వృక్షం లాగా తయారై దేశ విదేశాల్లో సేవలో అందించాలి.
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
బాన్సువాడ,(విజయక్రాంతి): దేశ విదేశాల్లో వైద్యుల ప్రాధాన్యత కంటే నర్సుల సేవలు ఎంతో గొప్ప వని ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందే విధంగా విద్యార్థినీలు కృషి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే ప్రచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భారత్ గార్డెన్స్ లో శనివారం Bsc నర్సింగ్ కాలేజీ బాన్సువాడ విద్యార్థినిల మొదటి వాలెట్ గ్రాడ్యువేషన్ సెర్మని డే & వీడ్కోలు సభ ( VALETE & Graduvation ceremony) వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం BSc నర్సింగ్ గ్రాడ్యువేషన్ పూర్తి అయిన విద్యార్థినీలకు డిగ్రీ పట్టాలను అందజేశారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... విత్తనంతో మొదలైన ఈ నర్సింగ్ కళాశాల పెరిగి పెద్దదై మహ వృక్షం గా తయారై విద్యార్థినీలు దేశ విదేశాలలో తమ సేవలను అందజేయాలని ఆయన పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో ఒకే జీవోతో ఒకే రోజు కళాశాల మంజూరు కావడమే కాకుండా నిధులు తగినoత మంది అధ్యాపకులును సిబ్బందిని సైతం ఇచ్చి కెసిఆర్ మంజూరు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గతంలో ఎస్ఆర్ఎన్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఒక సంవత్సరం పాటు మంత్రుల వద్ద మొరపెట్టుకుంటే సంవత్సరానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని ఆయన అన్నారు. జూనియర్ కళాశాలలో అలాగే ఎస్టీ వసతి గృహాలు నిర్మించడానికి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. అయినప్పటికీ ప్రిన్సిపాల్ అధ్యాపకులు కృషి ఫలితంగా నేడు 400 మంది విద్యార్థులు నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి నిధులను వెనువెంటనే విడుదల చేయించి కళాశాల భవనాన్ని అన్ని వసతులతో పూర్తి చేసుకుని ప్రారంభించామని ఆయన తెలిపారు.
ఇక్కడ విద్యను పూర్తి చేసి బయటకు వెళ్లే విద్యార్థినులకు మనదేశంలోనే కాకుండా విదేశాల సైతం మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అయినా చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ నర్సింగ్ కళాశాలను కూడా మంజూరు చేయాలని హన్సిని ఎమ్మెల్యే పోచారం దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ నర్సింగ్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినీలు చేసిన నృత్యాలు ఎంతో అలరించాయి. కళాశాల ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు భవన నిర్మాణ పనులను ఎల్ఈడి ద్వారా వీక్షించారు అభినందించారు.






