27 June, 2026 | 10:08 PM

బెల్లంపల్లిలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

27-06-2026 09:03 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన వివరాలను బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ కే శ్రీనివాసరావు వెల్లడించారు. బెల్లంపల్లి పట్టణం పోచమ్మ చెరువు వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న  మందమర్రి దీపక్ నగర్ కు చెందిన మహాదేవుని శివమణి అనే వ్యక్తి అరెస్టు అయ్యారు. నిందితుని నుంచి 200 గ్రాముల గంజాయి, రెండు స్మార్ట్ ఫోన్లు దొరికాయి. బెల్లంపల్లి 2 టౌన్ ఎస్సై తిరుపతి తమ పోలీస్ సిబ్బందితో కలసి  పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిందితుడు అనుమానాస్పదంగా కనిపించగా, అతని వద్ద ఉన్న నల్లటి కవర్ని పరిశీలించగా సుమారుగా 200 గ్రాముల గాంజా లభ్యం అయ్యింది.  నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు.

గంజాయికి బానిస అయిన నిందితుడు శివమణి సెంట్రింగ్ పని చేస్తున్నాడు. డబ్బులు సరిపోక అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో కొంత కాలంగా మహారాష్ట్ర లోని చంద్రాపూర్ కు వెళ్ళి చంద్రపూర్ రైల్వే స్టేషన్లో  అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర తక్కువ రేటుకు గాంజా కొని బెల్లంపల్లికి తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. తాను కొంత సేవించి మిగతాది ఎక్కువ రేటుకు బెల్లంపల్లిలో అమ్ముతున్నాడు. అదే క్రమంలో  26.06.26 న నిందితుడు బెల్లంపల్లి నుండి రైలు ద్వారా మహారాష్ట్రలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు దగ్గర  200 గ్రాములు, రూ. 5,000/- విలువైన గంజాయి కొని చంద్రపూర్ రైల్వే స్టేషన్ లో రాత్రి పడుకొని, శనివారం  11:00 గంటలకు చేరుకున్నాడు.

యధావిధిగా గంజాయిని విక్రయించడానికి పోచమ్మ చెరువు వద్దకు రాగా, అక్కడే వాహనాలను తనిఖి చేస్తున్న ఎస్. ఐ. తిరుపతి,సిబ్బంది కి పట్టుబడ్డాడు. Cr. No: 105/26 U/Sec 8(c) r/e 20(b) (ii) (A) 27  of NDPS Act-1984 క్రింద పోలీసులు  కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి 2 టౌన్ ఎస్సై శ్రీ తిరుపతి  తమ పోలీస్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పైన తెలిపిన నిందితుడు అనుమానాస్పదంగా కనిపించగా అతని వద్ద ఉన్న నల్లటి కవర్ని  పరిశీలించగా సుమారుగా 200 గ్రాముల గాంజా లభ్యం కావడంతో పంచనామా నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకొని

విచారించగా, గంజాయికి బానిస అయిన నిందితుడు తాను సెంట్రింగ్ పని చేసి సంపాదించిన డబ్బులు సరిపోక అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో కొంత కాలంగా మహారాష్ట్ర లోని చంద్రాపూర్ కు వెళ్ళి చంద్రపూర్ రైల్వే స్టేషన్లో  అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర తక్కువ రేటుకు గాంజా కొని బెల్లంపల్లికి తీసుకువచ్చి అందులో కొంత తను సేవించి మిగతాది ఎక్కువ రేటుకు బెల్లంపల్లి యువతకు అమ్ముతూ ఉండేవాడు,

అదే క్రమంలో  తేదీ 26.06.26 నా కూడా నిందితుడు బెల్లంపల్లి నుండి రైలు ద్వారా మహారాష్ట్రలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు దగ్గర  200 గ్రాములు, రూ. 5,000/- విలువైన గంజాయి కొని చంద్రపూర్ రైల్వే స్టేషన్ లో రాత్రి పడుకొని, ఈ రోజు అనగా తేదీ 27.06.2026 అందాజా సమయం 11:00 గంటలకి బెల్లంపల్లికి వచ్చి యధావిధిగా గంజాయిని ఇతరులకు అమ్ముటకు పోచమ్మ చెరువు వద్దకు రాగా అక్కడే వాహనాలను తనికి చేస్తున్న ఎస్. ఐ. తిరుపతి వారి సిబ్బంది నిందితుడిని పట్టుకొని విచారించి పంచనామా నిర్వహించి బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకురాగా ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాస రావు గారు నిదితుడిపై కేసు నమోదు చేసినారు.