27 June, 2026 | 10:47 PM

వెంకటాపురంలో సర్ ప్రక్రియ షురూ

27-06-2026 09:40 PM

వెంకటాపురం (నూగూరు),(విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ ప్రత్యేక సమగ్ర సవరణ  ప్రక్రియలో భాగంగా వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీలో ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం శనివారం సర్పంచ్ తాటి సరస్వతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, బూత్ లెవల్ అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు,సవరణ ఫారాలను పంపిణీ చేసే ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరస్వతి మాట్లాడుతూ, "18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.

మరణించిన వారి పేర్లు, డబుల్ ఎంట్రీలు తొలగించాలి. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి పకడ్బందీగా సర్వే నిర్వహించాలి" అని సూచించారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే బీఎల్‌ఓలకు సహకరించాలని,కొత్త ఓటరు నమోదు,అడ్రస్ మార్పు,తప్పుల సవరణ కోసం అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం శివ, బూత్ లెవల్ ఏజెంట్ యన్నమల్ల రమణయ్య, బూత్ లెవల్ అధికారి మీనా కుమారి,కాంగ్రెస్ జిల్లా నాయకులు ధనపనేని వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు ధనపనేని నాగరాజు శ్రీరాముల రమేష్ బాబు, మాజీ ఎంపీటీసీ సీతాదేవి,పంచాయతీ కార్యదర్శి గడ్డం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.