30 August, 2026 | 9:19 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

పాతబస్తీలో జంటహత్యల కలకలం

21-04-2026 09:57 AM

హైదరాబాద్: పాతబస్తీ(Old City Hyderabadమీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పురాలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. అన్న ఆదిల్ ఖాన్ సొంత తమ్ముడు అఖిల్ ఖాన్,  అడ్డొచ్చిన తమ్ముడి భార్య అజ్మీరాబేగంను పొడిచి చంపాడు. నాలుగు నెలలుగా అన్నదమ్ముల మధ్య డబ్బు విషయంలో గొడవ జరుగుతోంది. అన్న ఆదిల్ దగ్గర తమ్ముడు అఖిల్ ఖాన్ రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నాడు.

తీసుకున్న డబ్బు ఇవ్వడం లేదన్న కోపంతో ఆదిల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని, స్థానిక నివాసితులను ప్రశ్నించారు. వారు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.