30 August, 2026 | 10:37 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

రైఫిల్‌తో కాల్చుకుని ఆర్మీ జవాన్ ఆత్మహత్య

21-04-2026 11:06 AM

ఝాన్సీ: ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని( Jhansi district) బబినా కంటోన్మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఆర్మీ జవాను, విధి నిర్వహణలో ఉండగానే తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుడిని కోమల్ సింగ్‌గా గుర్తించారు. ఈయన గ్వాలియర్‌కు చెందినవారు. కాంటోన్మెంట్‌లోని డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్‌లో నాయక్ హోదాలో విధులు నిర్వర్తించేవారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని, విధి నిర్వహణలో ఉన్నప్పుడే అతను తన INSAS రైఫిల్‌తో తలలో కాల్చుకున్నాడని పోలీసులు తెలిపారు.