టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నియోజకవర్గ ఇన్చార్జి భూక్య సంజీవరావు నాయక్
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం జరిగినది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ జయప్రదం చేయాలని ముఖ్యఅతిథి నియోజకవర్గ ఇన్చార్జి భూక్య సంజీవరావు నాయక్ పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు ఆరవ తారీఖున జరిగే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ జయప్రదం చేయాలని అధిక సంఖ్యలో సమీకరించాలని నాయకులకు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనంతరం నడిగూడెం కోదాడ మండలాలు టౌన్ నుండి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి 20 కుటుంబాలు 30 మంది కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేనలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య సంజీవరావు ఆధ్వర్యంలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఏనుగుల యల్లేశ్వరరావు శైలజ నియోజకవర్గ మహిళా నాయకురాలు కంచేటి మమత మండల నాయకులు పాముల శివ చడపంగు ఉపేందర్ నడిగూడెం మండలం నాయకులు బాణాల వెంకట్ చిమిర్యాల గ్రామ శాఖ అధ్యక్షురాలు మర్రి జ్యోతి అరుణ తోట శ్రీనివాసరావు అరవిందు తదితరులు పాల్గొన్నారు.






