4 August, 2026 | 2:50 AM

ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచండి

03-08-2026 07:54 PM

ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి అల్లేపు పీటర్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు వైద్యం సరిగా అందడం లేదని వైద్య సేవలను మెరుగుపరిచేలా జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని ఎంన్సీపీఐ యు జిల్లా కార్యదర్శి అన్నారు. ఈ మేరకు వారి బృందం సోమవారం ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు లేక కంటి, దంత, ఎక్స్రే, ల్యాబ్ సౌకర్యాలు ఏళ్ల తరబడి సేవలు అందడం లేదని ఆరోపించారు. ఆసుపత్రి పడకలను పెంచి, వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆయన అన్నారు.

దీనిపై అనేకసార్లు నిరసన వ్యక్తం చేసిన గత ప్రభుత్వాల్లో ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు గడిచిన ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ ఆస్పత్రి సుమారు 6 మండలాల ప్రజలకు సేవలు అందించాల్సి ఉండగా వసతులు, వైద్యులు సరిగా లేనందున రోగులు ప్రైవేటుకు వెళ్లి ఆర్థిక భారం భరిస్తున్నారని దీనిని పై అధికారులు పట్టించుకుని నిరుపేదలకు వైద్యం మెరుగుపరిచి అందుబాటులోకి తేవాలని అన్నారు ఆయనతోపాటు ఆ సంఘం నాయకులు సహాయ కార్యదర్శి భూక్య సురేందర్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి స్వరూప ,సహాయ కార్యదర్శి ఎం సంధ్య ,తదితరులు ఉన్నారు.