31 July, 2026 | 3:08 AM

వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

31-07-2026 01:03 AM

బెజ్జూర్ జూలై  30, (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం కుష్ణపల్లి శివారులో గల ఒర్రె వరదలకు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం తెలుసుకొని ఆ ప్రాంతాన్ని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ శాఖ అనుమతులు రాక బెజ్జూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం లేకుండా పోయిందని తెలిపారు. వచ్చే నెలలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ని సంప్రదించి అటవీ అనుమతులు సాధిస్తామని తెలిపారు.

అనాధ పిల్లలకు అండగా ఉంటాం 

మండలంలోని రేచీని గ్రామంలో తల్లి తండ్రి కోల్పోయిన చిన్నారులను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. తల్లి మృతి చెందడంతో రైతు బీమా గురించి ఏవో నాగరాజును ఆన్లైన్లో భీమా వివరాలను పరిశీలించారు. చిన్నారులను బడికి పంపించాలని బాధ్యత గ్రామ ప్రజలందరూ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామ్మోహన్ రావు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సీఐ సంతోష్ కుమార్, ఎస్త్స్ర సర్తాజ్ పాషా, ఏవో నాగరాజు, సర్పంచ్ లావణ్య వడ్డేపల్లి శ్రీనివాస్, నాయకులు సామల తిరుపతి, గడ్డం రాజేష్,పొన్న ప్రవీణ్, నికాడి రమేష్, వసి ఉల్లా ఖాన్, మెస్రం రాజారామ్, గూడ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.,