వడ్డేపల్లి గ్రామంలో నల్లపోచమ్మ ఉత్సవాల్లో ట్రాక్టర్ల ప్రదర్శన
18-05-2026 02:23 AM
నిజాంసాగర్ మే 17( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ ఉత్సవాలు భాగంగా గ్రామంలో ట్రాక్టర్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మందిరం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన గ్రామస్తులు సాయంత్రం అలంకరించిన ట్రాక్టర్లతో గ్రామంలోని వీధుల్లో ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహించారు.
సోమవారం నాడు కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి,సర్పంచ్ బొజ్జ అంజయ్య,ఉప సర్పంచ్ పోచయ్య మాజీ ఎంపీటీసీ రాజారాంనాయకులు , సమీర్ ముజీమ్ విఠల్ రెడ్డి రాములు బాగారెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






