ఆదివారం తెరిచి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి
18-05-2026 02:24 AM
తాడ్వాయి, మే 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం అధికారులు తెరిచి ఉంచారు. గతవారం విజయక్రాంతి లో ప్రచురితమైన ఆదివారం.. ఆసుపత్రికి సెలవు.... అనే వార్తకు అధికారులు స్పందించారు.దీనిపై పై అధికారులు ఆస్పత్రి సిబ్బందికి ఆదేశాలు అందించారు.
ఆసుపత్రిని ఆదివారం తెరిచి ఉంచాలని రోగులకు సేవలు అందించాలని ఆదేశించడంతో ఆదివారం ఆసుపత్రి గేట్లు తెరుచుకొని ఉన్నాయి. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గత కొన్ని నెలల నుంచి ఆదివారం ఆసుపత్రిని మూసి ఉంచేవారని ఎప్పుడు తెరుచుకోలేదని తెలిపారు.విజయ క్రాంతిలో వార్త ప్రచురితం కావడంతోనే ఆస్పత్రిని వైద్యాధికారులు తెరిచి ఉంచారని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు విజయ క్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు.






