మల్లికార్జున స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు
18-05-2026 02:22 AM
భీమదేవరపల్లి, మే 17 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.భక్తులు సమర్పించిన నగదు 15 రోజులలో భక్తుల కానుకలను లెక్కించగా మొత్తం రూ.33,208 నగదు ఆదాయంతో పాటు మలేషియా రింగిట్ 20 విలువైన ఒక నాణెం లభించినట్లు దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారిపై అపార భక్తి విశ్వాసాలతో భక్తులు సమర్పించిన కానుకలకు దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.






