28 June, 2026 | 2:36 AM

డీ-అడిక్షన్ కేంద్రాలకు క్యారమ్ బోర్డు పంపిణీ చేసిన టౌన్ ఏసీపీ

28-06-2026 01:16 AM

ఖమ్మం, జూన్ 27(విజయక్రాంతి): గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వారికి కౌన్సెలింగ్‌తో పాటు ఇండోర్ క్రీడలు ఎంతో అవసరమని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్దాలకు అలవాటు పడి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో వున్న డీ-అడిక్షన్/ పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ పొందుతున్న బాధితులకు మానసికోల్లాసం కోసం ప్రభుత్వం అందజేసిన క్యారమ్ బోర్డును పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు టౌన్ ఏసీపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వారికి కౌన్సెలింగ్‌తోపాటు ఇండోర్ క్రీడలు ఎంతో అవసరమని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, బాధితుల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం డీ-అడిక్షన్ కేంద్రాలకు క్యారమ్ బోర్డులు, ఇండోర్ గేమ్స్‌ను పంపిణీ చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ సాంబరాజు,ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ, వైద్యులు, కౌన్సిలింగ్ బృందం పాల్గొన్నారు.