28 June, 2026 | 2:36 AM

ఘనంగా హెలెన్ కిల్లర్ 146వ జయంతి

28-06-2026 01:18 AM

హైదరాబాద్, జూన్ 27(విజయక్రాంతి): హెలెన్ కిల్లర్ 146వ జయంతి వేడుకలు స్థానికంగా ఉన్నటువంటి హెలెన్ కిల్లర్ విద్యాసంస్థ, నేరేడ్‌మెట్, సికిందరాబాద్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెలెన్ కిల్లర్ విద్యాసంస్థ, లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, హైటెక్ సిటీ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మరియు ఎన్‌పీఆర్‌డీ సంయుక్తంగా ఈ వేడుకలను ఘనంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గత నాలుగేళ్ల నుంచి మేడం పఠాన్ రమీజాబీ పేరు మీద ఉత్తమ సేవలు ఆందించిన అధ్యాపక సిబ్బందిని ఘనంగా సత్కరించి నగదు బహుమతి అందజేశారు. 34 సంవత్సరాలు తమ సేవలను అందించినటువంటి సత్యవతి దేవిని, గీతని సన్మానించారు.అదేవిధంగా వార్షిక సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు యాన్యువల్ ఎగ్జామినేషన్‌లో ఉత్తమ ఫలితాలను కనబరిచినందుకు మెమోటోస్, సర్టిఫికెట్లు, నగదు బహుమతిని సంస్థ ప్రిన్సిపాల్ పఠాన్ సాజిదా ఖాన్, యాజమాన్యం అందజేసింది.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హెలెన్ కిల్లర్ సంస్థ చైర్మన్ పటాన్ ఉమర్ ఖాన్,సమస్త ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరుముగం, లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లెనిన్ బాబు, అంజయ్య, వికలాంగుల హక్కుల జాతియ వేదిక ప్రెసిడెంట్ వెంకట్, ఎన్‌పీఆర్‌డీ సెక్రెటరీ అడివయ్య, సంస్థలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పఠాన్ ఉమర్ ఖాన్ హెలెన్ కిల్లర్  జీవిత విషయాలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో అంజయ్య, శ్రీధర్ , శశిధర్, పఠాన్ సాజిదా ఖాన్, గౌసుద్దీన్, భిక్షపతి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.