19 March, 2026 | 4:17 AM

చిరిగిన బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు

19-03-2026 01:03 AM

శ్రీరంగాపురం, మార్చి 18: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు చింపివేయబడిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. మార్చి 17న బీఆర్‌ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందుకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించి వేసి, వాటిని ఏర్పాటు చేసిన కట్టెలతో సహా ఎత్తుకెళ్లినట్లు పార్టీ నాయకులు ఆరోపించారు.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ దుండగుల పని కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడలేదని, ఇప్పుడు కొందరు నాయకులు అధికారం వచ్చిన తరువాత ఇలాంటి అనుచిత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై బుధవారం శ్రీరంగాపురం పోలీస్ స్టేషన్లో బీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. బాధ్యులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.