19 March, 2026 | 2:45 AM

సెక్షన్ 22 ఏ వల్ల సామాన్యులకు నష్టం కాకుండా చర్యలు తీసుకోవాలి

19-03-2026 01:04 AM
  1. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ‘గుట్ట’ వాసుల హర్షం
  2. బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం       

యాదగిరిగుట్ట, మార్చి 18 : రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22(A) వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను  ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య 8వ అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. బిఅర్‌ఎస్ బీజేపీ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలను భయాందోళనకు గురి చేస్తున్నారాని, ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాలుగా కేటాయించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దానితోపాటు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు అన్యాయం జరగనీయబోమని వారి ఇళ్ల,స్థలాల హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందుకుగాను సంబంధిత మంత్రివర్యులు ఆయా శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

అసెంబ్లీ వేదికగా పేదల ఇళ్ల పట్టాల సమస్యను ప్రస్తావిస్తూ ఆ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి క్రాయ విక్రయాలకు అర్హత కల్పించి బాధితులకు ఊరట కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భూములను, ఇండ్ల స్థలాలను సెక్షన్ 22(A) (ప్రభుత్వ భూములు లేదా వివాదాస్పద భూములు) కింద చేర్చడం వల్ల వేల సంఖ్యలో పేద, మధ్యతరగతి ప్రజలు తమ సొంత స్థలాలను అమ్ముకోలేక, కనీసం బ్యాంకు రుణాలు కూడా పొందలేక ఇబ్బంది పడుతున్నారని.

ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో దశాబ్దాల కాలంగా నివసిస్తున్న ఇండ్ల స్థలాలు కూడా ఈ జాబితాలో ఉండటంపై బాధితులు ఆవేదనతో ఉన్నారని కావున. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అర్హులైన పేదలకు చెందిన ఇండ్లను, ప్లాట్లను వెంటనే ఈ నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆయన కోరారు. యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్  బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేసిన  స్థానికులు, బాధితులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.