23 March, 2026 | 2:38 AM

మావోయిస్టు అగ్రనేత శంకర్‌కు అనారోగ్యం

23-03-2026 01:06 AM

జైలులోనే చికిత్సలు అందిస్తున్న అధికారులు

కుషాయిగూడ, మార్చి 22 (విజయక్రాంతి): ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని సెంట్రల్ జైలులో గత ఐదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్న సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు దుబాషి శంకర్ అలియాస్ మహేందర్ అలియాస్ రమేష్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

కొన్ని రోజులుగా అతనికి కుడి కాలులో ఇన్ఫెక్షన్ తీవ్రంగా పెరిగింది. విశాఖపట్నం జిల్లా గొల్లపల్లి ప్రాంతం లో 2014లో జరిగిన ఎదురు కాల్పుల్లో కుడి కాలుకు గాయపడినప్పటి నుంచి అతడు నొప్పితో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తు తం ఆ గాయం మళ్లీ ఇన్ఫెక్షన్‌కు గురవడం తో పరిస్థితి మరింత విషమించింది. ఇప్పటికే రెండు రోజులుగా కుడి కాలులో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో భువనేశ్వర్ సెంట్రల్ జైలు అధికారులు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆం దోళన వ్యక్తంచేస్తున్నారు. ఈయనపై వివిధ రాష్ట్రాల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండ లం చెట్ల నర్సంపల్లికి చెందిన దుబాషి శంకర్ గత 45 ఏళ్లుగా విప్లవ ఉద్యమంలో ఒడిశా ఏఓబీలో కొనసాగుతున్నాడు. 2018లో ఒడి శా రామడుగులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దుబాషి శంకర్ సహచరి లత చనిపోయింది.