అంగన్వాడీలో అక్రమ బదిలీ!
- మెట్‌పల్లి ప్రాజెక్ట్‌లో ఆగని అక్రమాలు
- చేతులు మారుతున్న రూ.లక్షలు
- స్థానికులకు కాకుండా వేరే మండలాల వారికి అవకాశం
మెట్‌పల్లి, జూలై 15 (విజయక్రాంతి): మెట్‌పల్లి సమగ్ర శిశు అభివృద్ధి సేవ కార్యాలయ (ప్రాజెక్ట్) పరిధిలోని అంగన్వాడీ కేంద్రం అక్రమాలకు నిలయంగా మారింది. మెట్‌పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టులో గుట్టు చప్పుడు కాకుండా మరో అక్రమ బదిలీ జరిగింది. జిల్లా స్థాయి అధికారుల మామూళ్ల మత్తు తో మెట్‌పల్లి పట్టణ నిరుద్యోగ మహిళల ఆశలు గల్లంతయ్యాయి.
ప్రస్తుతం బదిలీపై వచ్చిన అంగన్వాడీ టీచర్ గతేడాది కూడా మెట్‌పల్లికి బదిలీ కోసం ప్రయత్నం చేయడం ఈ విషయం పలు పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు అప్పుడు బదిలీ నిలిపివేశారు. ప్రస్తుతం జిల్లా అంగన్వాడీ టీచ ర్లు, ఆయాలా నోటిఫికేషన్ వచ్చే సమయం లో స్థానిక అధికారులకు సమాచారం లేకుం డా జిల్లా ఉన్నతాదికారులు చక్రం తిప్పి పోస్టింగ్ ఇవ్వడం వివాదానికి ఆజ్యం పోసినట్టు అయింది.
ఏడాది క్రితం మెట్‌పల్లి ప్రా జెక్ట్ పరిధిలోని మల్లాపూర్ మండల కేంద్రంలోని ఐదవ కేంద్రంలో పని చేస్తున్న అంగ న్వాడీ టీచర్‌ను నిబంధనలకు విరుద్ధంగా మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి బదిలీ చేసేందుకు జిల్లా అధికారులతో కలిసి అప్పటి స్థానిక అధికారులు రంగం సిద్ధం చేశారు. అప్పటికే దుబ్బవాడలో పని చేస్తున్న ఓ అంగన్వాడీ టీచర్ బదిలీపై నిజామాబాద్ జిల్లాకు వెళ్లా రు.
మల్లాపూర్ అంగన్వాడీ టీచర్ దుబ్బవాడ కేంద్రంపై దృష్టి పెట్టి, స్థానిక అధికారు లతో పాటు జిల్లా అధికారులను ఆశ్రయించింది. అప్పుడు మామూళ్ల మత్తులో అధికా రులు ఆమె కోరిన బదిలీకి సన్నాహాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం బదిలీపై వచ్చిన అంగన్వాడీ టీచర్ పట్టణ శివారులోని కీర్తి ఫంక్షన్ హల్ ఏరియాలో స్వంత ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
కానీ ని బంధన ప్రకారం అంగన్వాడీ టీచర్ బదిలీ జరగాలి అంటే ఆ టీచర్ ప్రస్తుతం బదిలీ కోరుతున్న అంగన్వాడీ కేంద్రం ఏరియాలో ఐదు సంవత్సరాలు నివాసం ఉండాల్సి ఉం ది. కానీ ప్రస్తుతం బదిలీపై వచ్చిన అంగన్వాడీ టీచర్ తాను దుబ్బవాడలో అద్దెకు ఉంటున్నట్లు దరఖాస్తులో పేర్కొంటూ మెట్ పల్లి రెసిడెన్సీ సర్టిఫికెట్ సమర్పించగా అధికారులు బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బదిలీ చేసినట్లు తెలిసింది.
ఇక స్థానిక రెవెన్యూ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టకుండానే రెసిడెన్సీ సర్టిఫికెట్ జరిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెట్‌ప ల్లి పట్టణ పరిధిలో ఉన్న సీనియర్ అంగన్వాడీ టీచర్ లు కొందరు కొన్ని ఏళ్లుగా వేరే వార్డ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వారు త మ వయస్సు దృష్ట్యా తమను ఖాళీ అయిన దుబ్బావాడకు బదిలీ చేయాలనీ కోరగా వారు దుబ్బవాడలో ఉండటం లేదని వారి అభ్యర్థనను స్థానిక అధికారులతో పాటు జిల్లా అధికారులు కూడా అప్పుడు తీరస్కరించారు.
కాని మల్లాపూర్ అంగన్వాడీ టీచర్‌ను బదిలీ వెనుక లక్షల్లో డబ్బులు చేతులు మారయానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగానే గత రెండు నెలల్లో జిల్లా స్థాయి లో జరిగిన అంగన్వాడీ టీచర్లు, సహాయకుల బదిలీలు, పదోన్నతులలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీపై వివరణ కోసం డీడబ్ల్యూఎస్‌వోను సంప్రదించగా విచారణ చేస్తాను అంటూ మాట దాటావేయగా స్థానిక సూపర్‌వైజర్ అడిగితే తాను కనుక్కొని చెపుతాను అంటూ ఫోన్ లిఫ్ట్ చేయక పోవడం గమనార్హం.






