16 July, 2026 | 12:50 AM

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

16-07-2026 12:45 AM
  1. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం
  2. ఎఫ్‌డీఆర్ సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్  విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ... విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు.

మేడ్చల్ జిల్లా అల్వాల్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఎఫ్‌డీఆర్) సహకారంతో ఏర్పాటు చేసిన ఎఫ్‌డీఆర్ సైన్స్ సెంటర్‌ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా రాష్ట్రంలో సమగ్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

కొత్త ఐడియాలను ఆవిష్కరణలుగా... వాటిని సమాజానికి ఉపయో గపడే ఉత్పత్తులుగా తీర్చిదిద్దేందుకు టీ- టీ-వర్క్స్, వీ--హబ్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశా లల్లో సైన్స్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు రావాలని ఎఫ్‌డీఆర్  ప్రతినిధులను మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, విజయేంద్ర ప్రసాద్, ఎఫ్డీఆర్ జనరల్ సెక్రటరీ జయప్రకాశ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.