రామప్పను సందర్శించిన విదేశీయులు
23-03-2026 01:04 AM
వెంకటాపూర్, మార్చి 22 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయంను నెదర్లాండ్ దేశానికి చెందిన సైమన్, జూలీయన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళా విశిష్టతలను వారికి వివరించారు. పర్యాటకులు మాట్లాడుతూ.. రామప్ప దేవాలయ శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉందని, ప్రతి శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని కొనియాడారు. అనంతరం వారు రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ను ఆస్వాదించారు. ఈ పర్యటనలో టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, బద్రు, అలాగే పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది పాల్గొన్నారు.




